Header Banner

టీటీడీ సంచలన నిర్ణయం! భక్తులకు అలర్ట్! ఇకపై వారికి ఈకేవైసీ తప్పనిసరి?

  Sun Mar 09, 2025 12:08        Devotional

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 67,127 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,910 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

 

ఇది కూడా చదవండి: గతంలో హౌస్ అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ ఇంటికి వెళ్లిన హోం మంత్రి! సేవాభావానికి మరో ఉదాహరణ!

 


వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో తొమ్మిది కంపార్ట్‌మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- టీటీడీ అధికారులు త్వరలో ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వివిధ రకాల ఆర్జిత సేవలు సహా అన్ని రకాల టికెట్లు/టోకెన్ల జారీ, తిరుపతి, తిరుమలల్లో ఉండే వసతి భవన సముదాయాల్లో గదుల బుకింగ్‌లో ఈకేవైసీ, ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థ అమలులోకి రానుంది. దీనికి కారణాలు లేకపోలేదు. టికెట్ల బుకింగ్‌లో దళారుల జోక్యాన్ని నివారించడానికి టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈకేవైసీ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్‌ను రెవెన్యూ (దేవాదాయం) శాఖ కార్యదర్శి వినయ్ చంద్ జారీ చేశారు. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ విధానాన్ని అమలు చేయాలంటూ టీటీడీ కొత్త పాలక మండలి తన తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే- ఆధార్ అథెంటికేషన్‌కు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ కార్యనిర్వహణాధికారి.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



ఇప్పుడు తాజాగా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ అనుమతులను ఇచ్చింది. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ అమలు విధానం కేంద్రం పరిధిలో ఉన్నందున ఈ అనుమతులను తీసుకోవడం తప్పనిసరి అయిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ అమలు వల్ల టికెట్ల బుకింగ్‌‌లో మరింత పారదర్శకత ఏర్పడుతుందని, టికెట్/టోకెన్ తీసుకున్న వాళ్లకు బదులుగా వేరొకరు దర్శనాలకు రావడం, వాళ్ల పేర్ల మీద గదులను బుక్ చేయడం వంటి లోపాలను సరిచేయవచ్చని అంటున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు స్వయంగా టోకెన్లు/టికెట్లను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోన్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #ttd #ttdticket #latestnews #flashnews